పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వర్ని మండల కేంద్రంలో ఏవిబిపి ఆధ్వర్యంలో ర్యాలీ రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 7వేల 8వందల వేలకోట్ల రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని లేకపోతే దశలవారీగా ఆందోళనలను ఉదృతం చేస్తామని హిందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశిరధర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వర్ని నగర కార్యదర్శి ప్రవీణ్, బోధన్ కార్యదర్శి సంజయ్, జగదీష్, దత్తు, అనిల్, ప్రభు, పవన్ పాల్గొన్నారు.