రాయదుర్గం - అనంతపురం జాతీయ రహదారిపై కాశీపురం మలుపు వద్ద గ్రానైట్ లోడుతో వెళుతున్న లారీ బ్రేక్ డౌన్ అయింది. అక్కడ నుంచి ముందుకూ వెనక్కు వెళ్లలేక అక్కడే రోడ్డు పై ఆగిపోయింది. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. శనివారం మద్యాహ్నం బొమ్మనహాల్ వైపు నుంచి హిందూపురం కు ఈ లోడ్ లారీ వెళుతుండగా ఇలా జరిగింది. రోడ్డుకు అడ్డంగా లోడు లారీ ఆగిపోవడంతో హైవే వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.