నల్లజర్ల మండలం పోతవరంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయిన ఘటన చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బైక్ రెండు ముక్కలైంది. ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని స్థానికులు కొయ్యరగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటంపై నల్లజర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.