దివ్యాంగులపై వివక్షత తగదని వైసీపీ ఎస్ఆర్ పురం మండల అధ్యక్షుడు మణి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలను అందజేయడంలో కూటమి ప్రభుత్వం వివక్షత చూపుతున్నట్టు ఆరోపించారు. టీడీపీ మద్దతుదారులకే పింఛన్లు మంజూరు చేస్తున్నారని, ఇతర దివ్యాంగుల పింఛన్లు రద్దు చేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కృపాలక్ష్మి ఆధ్వర్యంలోనే పార్టీ బలోపేతం అయ్యిందని స్పష్టం చేశారు.