వినాయక చవితి ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి అంటూ మైక్ అనౌన్స్మెంట్: గుడివాడ ఎస్ఐ చంటిబాబు స్తానిక గుడివాడ రూరల్ మండలం టిడ్కో గృహాల వద్ద వినాయక చవితి ఉత్సవ నిర్వాహకులకు ఎస్ఐ చంటిబాబు మైక్ అనౌన్స్మెంట్ ద్వారా శుక్రవారం మద్యాహ్నం 4 గంటల సమయంలో స్తానిక ప్రజలకు సూచనలు ఇచ్చారు. రాష్ట్ర పోలీసు శాఖ రూపొందించిన సింగిల్ విండో వెబ్సైట్లో ఉత్సవాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని ఆయన కోరారు. నిబంధనలకు విరుద్ధంగా ఉత్సవాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగె శాంతిభద్రతల దృష్ట్యా ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలన్నారు.