శుక్రవారం రోజున పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారులను అరెస్టు చేశారు పోలీసులు రాజస్థాన్ గుజరాత్ వ్యాపారులను హటావో తెలంగాణ వ్యాపారుల బచావో అనే నినాదంతో పెద్దపెల్లి పట్టణ వ్యాపారులు తమ వ్యాపార సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేసి నిరసన వ్యక్తం చేశారు వ్యాపారులకు తెలంగాణ ఉద్యమకారులు మద్దతు పలకడంతో పట్టణంలో ఆందోళన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో గడనా స్థలానికి చేరుకున్న పోలీసులు తెలంగాణ ఉద్యమకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు