కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలోని రమణయ్య పేట నుంచి అల్లూరి జిల్లాకు వచ్చే ప్రధాన రహదారి బాగు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12న భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహిస్తున్నట్లు గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు ఒక వీడియో ప్రకటనలో పేర్కొన్నారు. ఛలో గొంటువానిపాలెం నినాదంతో అందరు పార్టీలకు అతీతంగా రాస్తా రోకోకు హాజరు కావాలన్నారు. ఎన్ని సార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోవడంలేదని, అధికారుల తీరును నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన అన్నారు.