అడవి పందుల దాడిలో పంటలు నష్టపోయిన రైతులకు అటవీ అధికారులు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని టిఏజీఎస్ జిల్లా నాయకులు ఎస్కే అబ్దుల్లా డిమాండ్ చేశారు. శనివారం జన్నారం మండలం ధర్మారం గ్రామంలో అడవి పందుల దాడిలో దాదాపు పది ఎకరాల్లో మొక్కజొన్న పంటలు ధ్వంసమయిన పొలాలను వారు సందర్శించి మాట్లాడారు అడవి పందుల దాడిలో మొక్క జొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. అటవీ అధికారులు వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.