ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ప్రజలకు త్వరలో రైతు బజార్ అందుబాటులోకి రానున్నట్లు టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. ఇప్పటికే రైతు బజార్ పనులను పరిశీలించడం జరిగిందన్నారు. పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించడం జరిగింది అన్నారు. రైతులు పండించిన కూరగాయలను గిట్టుబాటు ధరలు విక్రయించేందుకు రైతు బజార్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.