సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం గొట్టిగార్పల్లి శివారులో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. సేడగుట్ట తండా కు చెందిన సురేష్ అనే యువకుడు ఆదివారం మధ్యాహ్నం సమయంలో గొట్టిగారుపల్లి శివారులో చెట్టుకు వేసుకొని మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు.ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.