భీమిలి నియోజకవర్గం వ్యాప్తంగా ఎడతెరపి లేని వర్షాలు గత రెండు రోజులుగా కురుస్తున్నాయి. ఎడతెరపి లేని వర్షం కారణంగా పరదేశిపాలెం జాతీయ రహదారి నుండి పాతపరదేశీపాలెం వెళ్లే దారిలో ఉన్న వంతెన పైనుండి మంగళవారం నదీ ప్రవాహంలా నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో ప్రధానంగా కొండపేట నూతన కాలనీ, పాత పరదేశీపాలెం, కే నగరంపాలెం ప్రజలకు రాక పోకలు బందయ్యాయి. మరింత వర్షాలు పడి ఎవరికైనా విపత్కర పరిస్థితులలో వెళ్లేందుకు వీలు కూడా ఆ రహదారిలో లేని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల జీవీఎంసీ కమీషనర్, జోన్ 1,2 కమీషనర్ లు, తహసీల్దార్ లు ఆ వంతెన ను పరిశీలించి నూతన వంతెన నిర్మాణానికి ఆదేశాలు జారీ చేసారు.