యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో ఆర్ ఆర్ ఆర్ రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ నాయకులు పరిశ్రమల యాజమాన్యులతో కుమ్మక్కై త్రి ఆర్ ఆర్ అలైట్మెంట్ను మార్చారని అన్నారు. రేపు అసెంబ్లీలో ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను తెలియజేస్తానని బాధితులకు ఎమ్మెల్యే తెలిపారు.