రాజంపేట మండలం శివాయిపల్లిలో పీహెచ్సీ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ విజయ మహాలక్ష్మి మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు జ్వరాలతో బాధపడుతున్న వారికి రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు. ఫీవర్ సర్వే, మలేరియా, డెంగ్యూ రాపిడ్ టెస్టులు చేసినట్లు పేర్కొన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విస్తరించే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.