శ్రీ సత్యసాయి జిల్లాలో 689.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు కలెక్టర్ కార్యాలయ అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు కురిసిన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి అత్యధికంగా ధర్మవరం మండలంలో 72.6 మి.మీ, తాడిమర్రి 52.2, రామగిరి 48.4, బుక్కపట్నం 38.0, తలపుల 36.2, ఎన్పీ కుంట మండలంలో 36.0 మి.మీ వర్షం కురిసిందన్నారు. మిగిలిన మండలాల్లో మోస్తరు వర్షం పడిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 32 మండలాలకు గాను 5 మండలాలు మినహా 27 మండలాలలో వర్షం కురిసిందని తెలిపారు