మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని టేక్మాల్ మండలం చర్లపల్లి గ్రామంలో భారీ వర్షాల కారణంగా రోడ్లు పూర్తిగా కొట్టుకపోయాయని శనివారం గ్రామస్తులు వాపోయారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రోడ్డు పక్కన పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకంగా మారాయని వాహనాల రాకపోగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని గ్రామస్తులు సందర్భంగా కోరుతున్నారు