గేదెలను తోలుకపోవడానికి వెళ్లి వ్యక్తి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి. ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలో టాటా ఏసీ ట్రాలీ పాదాచారిని ఢీకొని మృతి చెందిన ఘటన నేడు సోమవారం రోజున రాత్రి 8 గంటలకు చోటు చేసుకుంది. శ్రీనగర్ గ్రామానికి చెందిన ధారావాత్ భిక్షపతి అనే పాదాచారీ గేదెలను ఇంటికి తోలుకు పోతున్న క్రమంలో ఒక్కసారిగా ట్రాలీ ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో ధారావత్ బిక్షపతి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.