మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఎదులాబాదులోని లక్ష్మీనారాయణ చెరువును రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు సందర్శించారు. అదిలాబాదు చెరువులో గణపతి నిమర్జనం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సిపి సుధీర్ బాబు సూచించారు.