వాంకిడి మండలంలో అక్రమంగా గంజాయి పండించి, అమ్ముతున్న ఇద్దరిని వాంకిడి పోలీసులు పట్టుకున్నారు. వాంకిడి ఎస్ఐ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి మండలంలోని ఆర్లీ ,పెరకవాడ కి చెందిన ఇద్దరు వ్యక్తులు గంజాయి సాగు చేస్తూ, విక్రయిస్తున్నట్లు బుధవారం సాయంత్రం వచ్చిన సమాచారం మేరకు వారి పంట పొలాల్లో తనిఖీలు చేయగా 19 గంజాయి మొక్కలు లభ్యమైనట్లు తెలిపారు. 19 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు వాంకిడి ఎస్ఐ మహేందర్ పేర్కొన్నారు. గ్రామంలో ఎవరైనా గంజాయి పండించిన అమ్మిన వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.