నగరం నడిబొడ్డులో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలు లెక్కచేయకుండా విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేస్తున్న బన్సాల్ కళాశాల చైర్మన్ పై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని DYFI జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి కోరారు. సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్ ఆడిటోరియంలో అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్ కి జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి నాయకులు సుధాకర్ విష్ణు చందు రాజు తదితరులతో కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం తిరుపతి మాట్లాడుతూ బాలికలు 80 మంది బాలురు 90 చొప్పున విద్యార్థులను ఐఐటి జేఈ మెయిన్స్ ఇంటర్ కళాశాల అని తప్పుడు ప్రచారాలు చేస్తూ విద్యార్థులను మోసం చేస్తున్నారన్నారు.