బోనకల్ మండలంలోని మోటమర్రి గ్రామపంచాయతీలో ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అధికారులు వీధికుక్కల బెడదను అరికట్టి, పిల్లల ప్రాణాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.