విజయనగరం జిల్లా రాజాంలో గంజాయికి అలవాటు పడ్డ కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ఇటీవల వారి ఆగడాలు మరింత ఎక్కువయ్యాయని బాధితులు చెబుతున్నారు. గంజాయి మత్తులో ఇద్దరు తనపై దాడి చేసి ఫోన్, నగదు దోచుకుపోయారని శాసపు బాలాజీ అనే వ్యక్తి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు. నడిడి వెళ్తున్న తనపై వెనుక నుంచి వచ్చి మెడపై కొట్టడంతో స్పృహ తప్పిపోయాయని అటుగా వెళ్తున్న భవానీ స్వామి రక్షించి గ్రామస్థులకు సమచారం ఇచ్చారని తెలిపారు. కాగా ఆదివారం రాత్రి కూడా ఓ వైద్య విద్యార్థిపై గంజాయి బ్యాచ్ దాడి చేసింది. విద్యార్థి పై దాడికి సంబందించిన వీడియోను పోలీసులు విడుదల చేశారు.