సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్లో రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో నారాయణఖేడ్ వద్ద బుధవారం ఉదయం మనసుర్ పూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పిట్లం, కంగ్టి వైపు రాకపోకలు నిలిచిపోయి అంబులెన్స్ సహా వాహనాలు ఆగిపోయాయి. నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నారాయణఖేడ్ మున్సిపల్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటూ రహదారి అడ్డంగా జెసిబి, బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.