కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్త్రీ శక్తి పథకం వల్ల తమ ఉపాధిని కోల్పోయామని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురం లో వారు మాట్లాడుతూ ఆటో కార్మికులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం ఏటా 15000 ఇస్తుందని మాటలలో చెప్పడమే తప్ప చేతల్లో లేదని వాపోయారు. 50 సంవత్సరాలు నిండిన మా ఆటో డ్రైవర్లకు పెన్షన్ వసతి కలుగచేయాలని కోరారు. రేపటి నుంచి నల్ల బ్యాడ్జిలతో ఆటో కి నల్ల జెండాతో ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తామన్నారు.