సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఏబీవీపీ ఉమ్మడి మెదక్ జిల్లా విభాగ్ అభ్యాసవర్గ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. శనివారం ప్రారంభమైన శిక్షణ కార్యక్రమానికి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు చెందిన ఏబీవీపీ కార్యకర్తలు హాజరయ్యారు. రెండు రోజులపాటు జరిగే శిక్షణ కార్యక్రమానికి ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంబాబు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగ సమస్యలను గాలికి వదిలేసిందని నాయకులు ఆరోపించారు. స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో ప్రైవేటు యాజమాన్యాలు కళాశాలలను మూసి వేసే దిశగా అడుగులు వేస్తున్నాయని ఆరోపించారు.