ఏపీలో బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము ఏ పార్టీకి లేదని సిపిఐ నాయకులు రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా ఏపీలోని జనసేన, వైసిపి, టిడిపి పార్టీలపై వీరుచుకుపడ్డారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ఒంగోలు పరిసర ప్రాంతాలలోని సోషల్ మాధ్యమాలలో సిపిఐ నాయకులు రామకృష్ణ మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బిజెపి అంటే బాబు, జగన్, పవన్ అంటూ వ్యంగంగా మాట్లాడారు. దేశంలో బిజెపికి అన్ని పార్టీలు వత్తాసు పలికే రాష్ట్రం ఏదైనా ఉంటే అది ఒక మన ఆంధ్రప్రదేశ్ అని విమర్శలు గుప్పించారు.