రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్ శుక్రవారం కూనవరం విఆర్ పురం మండలాల్లో ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.వడ్డీగూడెం నుండి ప్రారంభమైంది. అనంతరం కూనవరం వంతెన వద్ద చేరుకుని, బోటు ద్వారా అంతర్గ్రామాలకు ప్రయాణం కొనసాగించారు. తదుపరి చింతరేవుపల్లి గ్రామం, రామవరం గ్రామంను సందర్శించారు.20 కిలోమీటర్లు నాటు పడవ పై ఎమ్మెల్యే ప్రయాణించి అక్కడ ప్రజల బాగోగులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గిరిజనులకు నిత్యవసర సరుకులను ఆమె అందజేశారు