మోండా మార్కెట్ డివిజన్లో ఒక కోటి 34 లక్షల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్ల నిర్మాణానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయని తెలిపారు. డివిజన్ ను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అలాగే ఆయన విద్యుత్ వైర్ల సమస్యపై స్పందించి వెంటనే విద్యుత్ వైర్ లను తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.