కలికిరి మండలం మర్రికుంట పల్లి రైతుసేవా కేంద్రంలో నానో ఎరువులు మరియు జీవన ఎరువులపై అవగాహనా కార్యక్రమాన్ని మండల వ్యవసాయాధికారి ఎం.హేమలత మంగళవారం నిర్వహించారు. కలికిరి మండల తహశీల్దార్ డి.హరికుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ యూరియాను అవసరమైనంత వరకు మాత్రమే పంటకు వినియోగించాలని. అలానే మార్కెట్లో అందుబాటులో వున్న నానో మరియు, నానో డిఎపి లను వాడుకోవాలని, దీనివల్ల రైతులకు ఎన్నో ఉపయోగాలు వున్నాయని తెలియజేశారు. మండల వ్యవసాయాధికారిణి ఎం.హేమలత జీవన ఎరువులను వాడడం వలన కలిగే ఉపయోగాలను తెలియజేశారు. అనంతరం రైతులకు నానో యూరియా పంపిణీ చేశారు.