నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నంత బాలికల పాఠశాలలో 120 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న భోజనశాల వంటశాల భవనమును నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం శంకుస్థాపన చేశారు. వంట గదిలో విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. ప్రభుత్వం మిస్ చార్జీలను పెంచిందని పేద బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు . గ్రౌండ్ ప్రహరీ గోడ పెంచి నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.