ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో నల్ల బర్లి పొగాకు సాగు నిషేధం, రసాయన చెరువుల వాడకాన్ని తగ్గించాలని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2025 26 రబి సీజన్లో నల్లబర్లి పొగాకు సాగు నిషేధించడం జరిగింది అన్నారు. అదేవిధంగా రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలని సేంద్రియ ఎరువులను అలవాటు చేసుకోవాలని రైతులకు సూచించారు. రసాయనక ఎరువుల వల్ల భూసారం తగ్గిపోతుంది దిగుబడి తగ్గుతుంది అన్నారు. సేంద్రియ ఎరువుల వల్ల భూమి సారవంతమవుతుందని రైతులకు సూచించారు.