సన్నబియ్యం సరఫరా సాఫిగా జరగాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జనగామలోని పలు రేషన్ షాప్ లను బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్బంగా కలెక్టర్ బియ్యం సరఫరా విషయాలు,బియ్యం క్వాలిటీ గురించి తెలుసుకొన్నారు.కొత్తగా వచ్చిన రేషన్ కార్డుదారులు సన్న బియ్యం పొందాలని తెలియజేసారు.జిల్లాలోని రేషన్ డీలర్లు అందరూ ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా సమయపాలన పాటిస్తూ రేషన్ షాపులు సకాలంలో తెరిచి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సన్న బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారు.