రాంగోపాల్పేటలోని సంతోషిమాత ఆలయంలో శ్రావణమాస చివరి శుక్రవారం పురస్కరించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన తెలిపారు.