తంబళ్లపల్లె మండలం కోటకొండ వద్ద శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుక్కరాజుపల్లెకు చెందిన శ్రీనివాసులురెడ్డి (50) బైకుపై వస్తుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. గాయాలతో అతన్ని వెంటనే మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించినట్లు తెలిపారు.పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.