వానపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. సొసైటీలో యూరియా నిల్వలు గురించి ఆరా తీశారు. నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలుసుకోవడంతో పాటుగా అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో 4500 బస్తాల యూరియా సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు.