శ్రీ సత్య సాయి జిల్లా పోలీసులు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ రత్న ఆదేశాలతో శ్రీ సత్య సాయి జిల్లాలో బహిరంగ ప్రదేశాలలో అసాంఘిక కార్యకలాపాలు , మరియు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై డ్రోన్ నిఘా సహకారంతో వాటిని అరికట్టే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆదివారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా డ్రోన్ నిఘాతో సమీప ప్రాంతాలలో అటవీ ప్రాంతం, పాడుబడిన నివాసాలు , నిర్మానుష ప్రదేశాలలో డ్రోన్ సహకారంతో ప్రత్యేక నిఘా ఉంచి బహిరంగంగా మద్యం సేవిస్తున్న వ్యక్తులను గుర్తిస్తున్నారు.