టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు ను పూతలపట్టి ఎమ్మెల్యే మురళీమోహన్ కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాణిపాకం లో టిటిడి కళ్యాణమండపం విశ్రాంతిభవనం నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను ఎమ్మెల్యే ఈవో చైర్మన్ డిఆర్ నాయుడుకు సమర్పించారు చైర్మన్ ప్రతిపాదన పై సానుకూల స్పందన తెలియజేసి క్షేత్ర అభివృద్ధికి టీటీడీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.