నిజాంపేట్ లో తల్లి , ఇద్దరు కుమారుల మరణం పట్ల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నారాయణఖే డిఎస్పి వెంకటరెడ్డి శనివారం తెలిపారు. మృతురాలి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతురాలు ప్రేమల భర్త సంగమేశ్ అదనపు కట్నం కోసం వేధింపులు, అనుమానంతో వేధింపులకు గురిచేయడంతో ప్రేమల తన పిల్లలను చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు.