కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని కొండాపురం మండలంలోని శ్రీ ఎద్దుల ఈశ్వర్ రెడ్డి గండికోట జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వతో కళకళలాడుతోంది. శనివారం తెల్సిన వివరాలు మేరకు గండికోట జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 26.85 టీఎంసీ లు కాగా 26 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు జలవనరుల శాఖ ఈఈ ఉమా మహేశ్వర్లు తెలిపారు. జలాశయం నుంచి మైలవరం జలాశయానికి 5000 క్యూసెక్యులు, చిత్రావతి రిజర్వాయర్కు 500 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం గండికోట ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 4,500 క్యూసెక్కుల నీరు ఉందన్నారు.