బనగానపల్లెలోని రైతు సేవా కేంద్రాల వద్ద యూరియా కోసం రైతులు శనివారం ఎదురుచూశారు. పట్టణ పరిసరాల్లో వేలాది ఎకరాలలో పంటసాగు చేయగా యూరియా తక్కువ మొత్తంలో అందుబాటులోకి వచ్చింది. దీంతో రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా సోమవారం వస్తుందని అధికారులు బదులివ్వడంతో గంటల సేపు క్యూలో నిల్చొన్న రైతులు అసహనం వ్యక్తం చేశారు.