శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.1,31,752 ఆర్థిక సహాయాన్ని మంగళవారం సాయంత్రం అంజినమ్మ, వెంకటశివారెడ్డి కుటుంబాలకు అందజేశారు. కష్టాల్లో ఉన్న పేదలకు సీఎం అండగా నిలుస్తున్నారని, ఆర్థికంగా ఎదగడానికి సహాయం చేస్తున్నారని ఆమె తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 150 మందికి పైగా సుమారు రూ.2 కోట్లకు పైగా సీఎం సహాయనిధి ద్వారా లబ్ధి పొందారని, ఈ నిధిని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.