నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో ఆదివారం 12:30 గంటల సమయంలో వినాయక నిమజ్జనం పై వినాయక కమిటీ సభ్యులు నిర్వాహకులు యువతతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 5వ తేదీ రాత్రి 12 గంటల లోపు నిమజ్జనం ప్రారంభించి 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నిమజ్జనం పూర్తి చేయాలని నిర్ణయించారు. పోలీసులు డీజే లకు అనుమతి నిరాకరించడంతో సౌండ్ తగ్గించుకోవాలని సూచించారు. వచ్చే సంవత్సరం నుండి డీజే లకు బదులు భజనలు, చిడతల భజనలు, బ్యాండ్ వాయిద్యాలతో ఉత్సవాలు నిర్వహించాలని కమిటీ సభ్యులు యువతకు విజ్ఞప్తి చేశారు.