ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 16 వరకు నిర్వహించనున్న కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను ఆలయ ఈఓ పెంచల కిషోర్ ఆహ్వాన పత్రిక అందించి సాదరంగా ఆహ్వానించారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ ను కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఈఓ కలిశారు. ఈ సందర్భంగా వేద పండితులు వేద ఆశీర్వచనం పలుకగా ఆలయ ఈఓ బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 16 వరకు నిర్వహించనున్న కాణిపాక శ్రీ వరసిద్ధి వినా