ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొమురం భీం అడ ప్రాజెక్టులోకి భారీగా నీళ్లు చేరాయి. దీంతో ప్రాజెక్టు అధికారులు మంగళవారం మధ్యాహ్నం 629 క్యూసెక్కుల వరద నీటిని పెద్దవాగులో వదిలారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుతం 237 మీటర్లకు చేరింది. మరో రెండు గంటల పాటు వర్షం కురుస్తే మరో గేటు ఎత్తివేసే అవకాశం ఉంటుందన్నారు.