ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయం చంద్రగ్రహణం కారణంగా శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు మూసివేశారు. అర్చకులు గర్భాలయం, రాజగోపుర ద్వారాలను మూసివేశారు. సోమవారం ఉదయం సంప్రోక్షణల అనంతరం 9.30 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.