గాజులరామారం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా సిపిఐ ధర్నా నిర్వహించింది. ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ కమిషనర్ మల్లారెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. జిల్లా కార్యదర్శి ఉమామహేష్ మాట్లాడుతూ గత నెల వర్షం వల్ల సర్కిల్లో రోడ్లు పాడైపోయాయి అన్నారు. అనేకచోట్ల గుంతలు ఏర్పడ్డాయని, వాహనదారులకు ఇబ్బందులు అవుతున్నాయని తెలిపారు. తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని కోరారు.