కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో శనివారం ఆర్డీఓ సాయిశ్రీ, డియస్పి వెంకటేశ్వర రావు మరియు వ్యవసాయ అధికారి సుస్మిత సమావేశం నిర్వహించి యూరియ కొరత కు సంబంధించి సంయుక్తంగా పత్రిక ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం జమ్మలమడుగు సబ్ డివిజన్ లో ఎటువంటి యూరియ కొరత లేదని, యూరియ రైతు సేవ కేంద్రాలలో, అలాగే ప్రైవేటు దుకాణాల యందు అందుబాటులో ఉందని తెలిపారు. ప్రస్తుతం జమ్మలమడుగు సబ్ డివిజన్లో 2600 ఎకరముల వరి పంట సాగు వేయడం జరిగినదన్నారు. రైతులకు యూరియ లబించడం లేదని ఎవరికైనా అపోహలు మరియు సమస్యలు ఉంటె మండల వ్యవసాయ అధికారులను సంప్రదించగలరని తెలిపారు.