భీమవరం బలుసుమూడికి చెందిన బుడ్డిగ శ్యామ్ గణేష్ వెంకటేశ్వర్ల తల్లి అన్నపూర్ణమ్మ (78) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆమె మరణానంతరం కుటుంబ సభ్యులు సామాజిక బాధ్యతను చాటుతూ ఆమె నేత్రాలను దానం చేశారు. నిడదవోలు శ్రీ రాజరాజేశ్వరి రామకృష్ణ నేత్రవైద్యాలయం వైద్యులు భీమవరం మధ్యాహ్నం నాలుగు గంటలకు చేరుకుని అన్నపూర్ణమ్మ నేత్రాలను సేకరించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రముఖులు కుటుంబ సభ్యుల సేవాభావాన్ని అభినందించి, నేత్రదానం ద్వారా ఇద్దరికి కొత్త జీవన వెలుగు లభిస్తుందని పేర్కొన్నారు. మరణానంతరం కూడా సమాజానికి ఉపకారం చేసేగొప్ప అవకాశం నేత్రదానమేనని గుర్తుచేశారు.