నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో శనివారం వినాయక నిమర్జనం ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎస్పి వినాయకునికి ప్రత్యేక పూజలు చేసి,అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతిలో ఏర్పాటుచేసిన శోభాయాత్ర లో పోలీసులు ఉత్సాహంగా పాల్గొని వినాయకుని నిమజ్జనం చేశారు.