రాజంపేట మండల కేంద్రంలోని మదన గోపాలపురంలో సోమవారం జరిగే ప్రజావేదిక ప్రాంగణం ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతున్న నేపథ్యంలో అధికారులు దగ్గరుండి అన్ని పనులు పర్యవేక్షిస్తున్నారు. ప్రజా వేదిక వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత చర్యలు చేపడుతున్నారు.