ప్రతీ రైతు ప్రత్యామ్నాయ పంటలు పండించాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ తెలిపారు. గురువారం సోమందేపల్లిలో ఆయన మాట్లాడారు. రైతులు కేవలం వరి పంటకే పరిమితం కాకుండా ప్రత్యామ్నాయ పంటలైన వేరుశనగ, రాగి, జొన్న, కందులు, మొక్కజొన్న తదితర పంటలు పెట్టాలన్నారు. కేవలం వరి మాత్రమే పండిస్తే భూమి సారవంతం కోల్పోతుందన్నారు. అదేవిధంగా ప్రతీ రైతు తమ పంటలకు సారవంతమైన స్వచ్ఛమైన ఎరువు మాత్రమే వాడాలని సూచించారు.